అక్షరటుడే, బోధన్: Bodhan | జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో వరద నీరు కాల్వలు, వాగులు, చెరువుల్లోకి వచ్చి చేరుతోంది. కాగా.. వర్షం కారణంగా బోధన్ పట్టణంలోని షర్బత్ కెనాల్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఈ నీళ్లు బస్టాండ్ ప్రాంతం వరకు వచ్చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువలో చెత్తాచెదారం ఇరుక్కుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు కాలువ క్లియర్ చేసే పనులు చేపట్టారు.
ఈ పనులను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో శనివారం దగ్గరుండి పరిశీలిస్తున్నారు. వర్షాలతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని షర్బత్ కెనాల్లో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేసి నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కూడా ఉన్నారు.