అక్షరటుడే, బాన్సువాడ: Navaratri | బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం శరన్నవరాత్రి ఉత్సవాలు (Sharannavaratri celebrations) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అమ్మవారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మహిళా కార్పొరేషన్ మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అట్లూరి రమాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహిళలు పెద్దఎత్తున హాజరై అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్, కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు కమ్మ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాంబాబు, దేవళ్ళ రవి కుమార్, దేవళ్ళ శ్రీనివాస్, శ్రీకాంత్, భవాని మాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.