అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Devi Navarathrulu | సనాతన ధర్మాన్ని అనుసరించేవారు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ప్రధానంగా విజయవాడ(Vijayawada)లోని ఇంద్రకీలాద్రిపై ఈ ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహిస్తారు. సాధారణంగా అమ్మవారు పది రూపాల్లో దర్శనమిస్తుంటారు. ఈసారి 11 రూపాల్లో దర్శనమివ్వనున్నారు. ఇలా ఎందుకు చేస్తారంటే..
దసరా శరన్నవరాత్రి(Sharanavaratri) ఉత్సవాలు ఈనెల 22న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీలో ముగుస్తాయి. అంటే 11 రోజులపాటు ఉత్సవాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రతి పదేళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. గతంలో 2016లో 11 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది తిథి వృద్ధితో 11 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. సాధారణంగా ఏటా అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది తిథి వృద్ధి కారణంగా కొత్తగా అమ్మవారు కాత్యాయినీదేవి(Katyayani Devi)గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. చివరిరోజు విజయదశమి(Vijaya Dasami).. ఆ రోజును దసరా అంటారు.
ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారంటే..
అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకో రూపంలో దర్శనమిస్తారు. ఏ రోజు, ఏ రూపంలో దర్శనమిస్తారో తెలుసుకుందామా..
సెప్టెంబర్ 22 : శ్రీ బాలాత్రిపురసుందరి దేవి
సెప్టెంబర్ 23 : శ్రీ గాయత్రి దేవి
సెప్టెంబర్ 24 : శ్రీ అన్నపూర్ణ దేవి
సెప్టెంబర్ 25 : శ్రీ కాత్యాయినీదేవి
సెప్టెంబర్ 26 : శ్రీ మహాలక్ష్మీదేవి
సెప్టెంబర్ 27 : శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 28 : శ్రీ మహాచండీదేవి
సెప్టెంబర్ 29 : శ్రీసరస్వతి దేవి
సెప్టెంబర్ 30 : శ్రీ దుర్గా దేవి
అక్టోబర్ 1 : శ్రీ మహిషాసురమర్ధిని దేవి
అక్టోబర్ 2 : శ్రీ రాజరాజేశ్వరి దేవి