అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sharad Pawar Health Update | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించింది. చికిత్స కోసం ఆయనను పూణేలోని రూబీ హాల్ క్లినిక్ (Ruby Hall Clinic)లో చేర్చారు.శరద్ పవార్ బారామతిలో ఉండగా అస్వస్థతకు గురి అయ్యారు.
దీంతో వెంటనే పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించారు. శరద్ పవార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. ఆయనకు జ్వరం, దగ్గు ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు. శరద్ పవార్ బారామతి (Baramati)లోని తన గోవింద్ బాగ్ నివాసంలో ఉన్నారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు. అయితే ఉదయం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడటం ప్రారంభించారు. దీంతో వైద్యులు వచ్చి పరీక్షించారు. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించారు.
Sharad Pawar Health Update | పరీక్షించిన వైద్యులు
రూబీ హాల్ వైద్యులు శరద్ పవార్‌ను పరీక్షించారు. ఆయన గొంతు నొప్పి, కఫంతో బాధపడుతున్నారని చెప్పారు. దీంతో శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ మాట్లాడుతూ వైద్యుల బృందం శరద్ పవార్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని అన్నారు. కొన్ని పరీక్షలు జరిగాయి, ఆ తర్వాత మందుల షెడ్యూల్ నిర్ణయిస్తామన్నారు. కాగా 85 ఏళ్ల పవార్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.