అక్షరటుడే, వెబ్‌డెస్క్:Shanti Gold IPO | బంగారు ఆభరణాల తయారీ రంగానికి చెందిన శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్(Shanti Gold International) ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్లు ఒకటో తేదీన లిస్టవనున్నాయి. ప్రస్తుతం జీఎంపీ 17 శాతానికిపైగా ఉంది. ఐపీవో(IPO) వివరాలిలా ఉన్నాయి.
హైక్వాలిటీ 22 క్యారెట్ బంగారు ఆభరణాలని డిజైన్ చేయడంతో పాటు తయారు చేసి విక్రయించే శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ రూ. 360.11 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) కింద రూ. 10 ముఖ విలువ కలిగిన 1,80,96,000 షేర్లను విక్రయించడం ద్వారా రూ. 360.11 కోట్లను పొందాలని భావిస్తుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ ఇప్పటికే తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం, వర్కింగ్ క్యాపిటల్(Working capital) అవసరాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ధరల శ్రేణి:ప్రైస్ బ్యాండ్(Price band)ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 189 నుంచి రూ. 199 లుగా కంపెనీ నిర్ణయించింది. ఐపీవోలో పాల్గొనాలనుకునేవారు కనీసం 75 షేర్స్ కోసం బిడ్ వేయాల్సి ఉంటుంది. గరిష్ట ధర(రూ. 199) వద్ద రూ. 14,925 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ:క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటాను కేటాయించింది. ఈ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్ ప్రీమియం 17.5 శాతంగా ఉంది.
ముఖ్యమైన వివరాలు:ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) శుక్రవారం ప్రారంభమైంది. మంగళవారం వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంది. 30న రాత్రి షేర్లను అలాట్ చేసే అవకాశాలున్నాయి. ఒకటో తేదీన కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతాయి.
ఈ ఐపీవోకు బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టార్‌గా, చాయిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించనున్నాయి.
