అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Fire Station | నిజామాబాద్ ఫైర్‌స్టేషన్ అధికారిగా (Nizamabad Fire Station) శంకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిర్మల్ ఫైర్‌స్టేషన్ (Nirmal Fire station) నుంచి పదోన్నతిపై నిజామాబాద్‌కు వచ్చారు. అలాగే బోధన్ ఎస్ఎఫ్వోగా (Bodhan Fire Station) సుభాష్ నియమితులయ్యారు. ఆయన ఆదిలాబాద్ నుంచి పదోన్నతిపై బోధన్ వచ్చారు. అలాగే నిజామాబాద్ ఫైరింజన్ పైలెట్‌గా పనిచేస్తున్న ఎండీ షఫీ పదోన్నతిపై ఆదిలాబాద్ ఇచ్చోడ ఎస్ఎఫ్వోగా వెళ్లారు. వీరికి డీఎఫ్‌వో పరమేశ్వర్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎస్ఎఫ్వో శంకర్ మాట్లాడుతూ ఎక్కడా అగ్నిప్రమాదాలు జరిగినా వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఎఫ్‌ఎఫ్‌వో శంకర్ 8712699225కు ఫోన్ చేయాలని లేదా అగ్నిమాపక కేంద్రం 8712699224కు సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.