అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Shamantha Katpally Campaign | కాంగ్రెస్ ముఖ్య నాయకుల సహకారంతో 19వ డివిజన్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిని (Congress Corporator Candidate) శమంత కాటిపల్లి అన్నారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Shamantha Katpally Campaign | అధినాయకుల సాకారంతో..
రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా (Nizamabad district) వాసి కావడం మన అదృష్టమన్నారు. పీసీసీ చీఫ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ (Shabbir Ali) సహకారంతో డివిజన్‌ను అన్నివిధాలుగా ముందుకు తీసుకెళ్తామని శమంత కాటిపల్లి తెలిపారు. ఒక్కసారి తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వాలని తద్వారా డివిజన్లో సమూలంగా మార్పులు తెస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరిని కలుస్తూ ఇంటింటికి తిరుగుతూ ఆమె ఓట్లను అభ్యర్థించారు. ప్రజల కష్టసుఖాలను తెలుకున్నారు.
Shamantha Katpally Campaign | సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా..
ఇటీవల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించారని నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పూర్తిగా తనదేనని ఆయన హామీ ఇచ్చారని శమంత అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సహకారంతో డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ముందుంటామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఉన్నందున నగరంలోని డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

