అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shahid Afridi | పాకిస్తాన్ మాజీ క్రికెట్ స్టార్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) చనిపోయాడన్న వదంతులు నిన్నటి నుండి సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయ్యాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్తలు షేర్ అవుతుండడంతో అందరు అవాక్కయ్యారు. ఆల్‌రౌండర్ లెజెండ్ ఇక లేరు అనే క్యాప్షన్లు, ఫేక్ ఫోటోలు, ఈవెన్ కొన్ని ఫేక్ న్యూస్ వెబ్‌సైట్లలో (Website) అసత్య కథనాలు కూడా కనిపించాయి. అయితే అవి వదంతులేనని తేలింది. సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతున్న వీడియోలో ఒక పాకిస్థాన్ న్యూస్ యాంకర్ అఫ్రిది మరణించినట్లు ప్రకటిస్తున్నట్లుగా ఉంది. అయితే దీనిపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా అది అసత్యం అని తేలింది.
Shahid Afridi | ఇది నిజమా?
షాహిద్‌ని కరాచీలో ఖననం చేశారని.. విజన్ గ్రూప్ ఛైర్మన్‌తో సహా చాలా మంది అధికారులు కూడా సంతాపం వ్యక్తం చేసినట్లు వీడియోపేర్కొన్నారు. దర్యాప్తు చేసినప్పుడు ఈ వైరల్ వీడియో ఏఐ AI తో (AI Video) తయారు చేయబడిందని తేలింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అఫ్రిది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతని మరణ వార్త అబద్ధం అంటూ తేల్చేశారు. దీంతో ఆయన అభిమానులు కాస్త ఊరట చెందారు. షాహిద్ ఆఫ్రిది ఆపరేషన్ సిందూర్ (Opration Sindoor) సమయంలో కాస్త ఎక్కువగా ప్రకటనలు చేయడం మనం చూశాం. షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని (Indian Army), భారత ప్రజలను (Indian People) లక్ష్యంగా చేసుకుని అనేక సార్లు ప్రకటనలు చేయడంతో ఆయన విమర్శలని మనోళ్లు కూడా గట్టిగానే తిప్పి కొట్టారు.
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత షాహిద్ ఆఫ్రిది రాజకీయ కార్యకలాపాలలో (Politics) కూడా పాల్గొన్నాడు. షాహిద్ అఫ్రిది క్రికెట్ కెరీర్‌ను (Cricket Carrer) పరిశీలిస్తే అతను 2017లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో పాకిస్థాన్‌కు (Pakistan) ప్రాతినిధ్యం వహిస్తూ అఫ్రిది 11 వేలకు పైగా పరుగులు సాధించాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో 541 వికెట్లు తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ అఫ్రిది పేరు మీద ఉంది. తన వన్డే కెరీర్‌లో షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohith Sharma) అతనికి కేవలం 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.