అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actress Shagna Sri Venun | సినీ పరిశ్రమ (Film Industry)లో నటులు దర్శకులుగా మారడం సాధారణమే. అయితే హీరోయిన్లు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన జాబితాలో తాజాగా హీరోయిన్ షగ్న శ్రీ వేణున్ చేరారు.
నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు దర్శకురాలిగా మారి తన తొలి సినిమాను అధికారికంగా ప్రకటించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. షగ్న శ్రీ వేణున్కు ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ (Government Junior College) సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటిగా కొనసాగుతూనే ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపార రంగంలోనూ చురుగ్గా వ్యవహరిస్తూ సోషల్ మీడియా (Social Media)లోనూ యాక్టివ్‌గా ఉండే షగ్న, ఇప్పుడు దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టడం గమనార్హం.
Actress Shagna Sri Venun | కొత్త స్టెప్..
మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతున్న ఈ సమయంలో, ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేకంగా నిలుస్తోంది.ఎస్ 2 ఎస్ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా వరుణ్ సందేశ్ నటించనుండగా, హీరోయిన్గా షగ్న శ్రీ వేణునే కనిపించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు ఆమెనే దర్శకత్వం వహించడం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని, 2026 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్లో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న యువ జంట చేతిలో రోజా పూలతో కనిపించగా, మరో యువకుడు ఆ జంటలోని యువతి చేయి పట్టుకున్నట్లు చూపించడం గమనార్హం. ఈ విజువల్ చూసినవారికి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. పోస్టర్ డిజైన్, కాన్సెప్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మొత్తానికి హీరోయిన్గా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న షగ్న శ్రీ వేణున్, ఇప్పుడు దర్శకురాలిగా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందోనన్న ఆసక్తి సినీ ప్రేమికుల్లో నెలకొంది. నటనతో పాటు దర్శకత్వం (Director)లోనూ ఆమె సత్తా చాటగలిగితే, ఇండస్ట్రీలో ఒక కొత్త, బలమైన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు నిలిచే అవకాశాలు లేకపోలేదని చెప్పవచ్చు.