అక్షరటుడే, హైదరాబాద్: Shabbir Ali | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు (Senior Congress leader), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆశలు గల్లంతయ్యాయి.
మరోసారి మంత్రి పదవి చేపట్టాలనుకున్న ఆయన కలలు కల్లలయ్యాయి. మైనార్టీ కోటాలో తనకు తప్పకుండా అమాత్యయోగం లభిస్తుందనుకున్న అలీకి భంగపాటే మిగిలింది.
గవర్నర్ కోటా governor’s quota లో ఎమ్మెల్సీగా నియమితులైన మాజీ క్రికెటర్, హైదరాబాద్ నగరానికి చెందిన కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) కు మంత్రి పదవి దక్కనుంది.
ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, నేడో, రేపో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల Jubilee Hills elections నేపథ్యంలో మైనార్టీల ఓటర్లను ఆకర్షించడానికే పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Shabbir Ali | విద్యార్థి నేతగా ఎదిగి..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో 1957లో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన షబ్బీర్ అలీ.. ఎన్ఎస్యూఐ (NSUI) లో చేరి విద్యార్థి నాయకుడిగా ఎదిగారు.
1989లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. 32 ఏళ్లకే మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2004లో మరోసారి బంపర్ మెజార్టీతో గెలిచిన షబ్బీర్ అలీ.. వైఎస్ ప్రభుత్వంలో విద్యుత్, మైనార్టీ, వక్ఫ్ శాఖల మంత్రిగా పని చేశారు.
తెలంగాణ సిద్ధించాక జరిగిన ఎన్నికల్లో వరుసగా ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, మండలిలో ప్రతిపక్ష నాయకుడిని చేసింది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో షబ్బీర్ అలీ వేరే స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బరిలోకి దిగిన ఆయనకు భంగపాటు తప్పలేదు.
Shabbir Ali | ఆశలు ఆవిరి..
పదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. దీంతో హస్తం పార్టీ అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించి అధికారం కైవసం చేసుకుంది.
దీంతో మైనార్టీ కోటాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి షబ్బీర్ అలీకి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు.
షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసి పోవడంతో, ఆయనకు మరోసారి అవకాశం కల్పించి కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది.
కానీ, government advisor షబ్బీర్ అలీకి నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ పదవి రాకుండా, మంత్రిపదవి దక్కకుండా పోయింది. అసలు ఉమ్మడి జిల్లా నుంచే కేబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్‌కు కాంగ్రెస్ తొలుత చాన్స్ ఇచ్చింది. అయితే, కోర్టు ఈ నియామకంపై స్టే విధించడంతో రేవంత్ సర్కారు మరోసారి ఎమ్మెల్సీ నియామక ప్రక్రియను చేపట్టింది.
కోదండరాంతో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ నేత, క్రికెటర్ అజారుద్దీన్‌కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మైనార్టీ ఓట్లకు గాలం వేయాలన్న లక్ష్యంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది.
అజారుద్దీన్‌తో మైనార్టీ కోటా భర్తీ కానుండటంతో షబ్బీర్ అలీ ఆశలు గల్లంతయ్యాయి. అటు ఎమ్మెల్సీ రాక, ఇటు అమాత్య యోగం లభించక ఆయన అనుచరులు నారాజ్ అవుతున్నారు.

