అక్షరటుడే, వెబ్డెస్క్: Shabbir Ali | హిందూ పత్రిక ఫొటోగ్రాఫర్ రమణ(Photographer Ramana) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో ప్రభుత్వ సలహాదారు, అర్బన్ ఇన్ఛార్జి షబ్బీర్ అలీ(Shabbir Ali) స్పందించారు. ఆయన తరపున టీయూడబ్ల్యూజే నాయకులు రూ.25వేల ఆర్థికసాయాన్ని రమణ సతీమణికి ఆదివారం నిజామాబాద్ నగరంలో అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ ప్రతినిధులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, యూనియన్ ప్రతినిధులు అహ్మద్ అలీఖాన్, ధనుంజయ్, గోవిందరాజు, రతన్ తదితరులు పాల్గొన్నారు.