అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో (Government Degree College) బీసీ సభ (BC Sabha) కోసం స్థలాన్ని ఆదివారం మంత్రుల బృందం పరిశీలించింది. అనంతరం మంత్రుల బృందానికి సంబంధించిన కాన్వాయి శుభం కన్వెన్షన్ హాలుకు బయలుదేరింది.
అయితే కాన్వాయిలో ఓ కారు మరొక కారును ఓవర్టేక్ చేసేక్రమంలో షబ్బీర్ అలీ కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారుకు ఒకవైపు గీతలు పడ్డాయి. అయితే కారులో మంత్రులెవరు లేరని, పీఏలు, గన్మెన్లు ఉన్నట్టు సమాచారం. కారు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి.