అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి (Shabbir Ali) మంత్రి పదవి ఇచ్చి కామారెడ్డి జిల్లా అభివృద్ధికి సహకరించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కామారెడ్డి (Kamareddy) అభివృద్ధి కోసం పాటుపడ్డ వ్యక్తి షబ్బీర్ అలీ అని తెలిపారు. 15 ఏళ్ల నుంచి కామారెడ్డి అభివృద్ధికి నోచుకోలేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కనీసం విద్యార్థుల కోసం ఉన్నత విద్యాసంస్థలు లేనటువంటి జిల్లాగా కామారెడ్డి నిలిచిపోయిందన్నారు.
అభివృద్ధి పనులకు నిధులు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం జరగాలంటే షబ్బీర్ అలీకి మంత్రి పదవి (ministerial post) ఇవ్వాలన్నారు. తద్వారా కామారెడ్డి అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాలని, మంత్రి పదవి వచ్చే విధంగా సీఎం కృషి చేయాలని కోరారు.

