Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | రాజీవ్​ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ

Shabbir Ali | రాజీవ్​ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Shabbir Ali | దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతిని హైదరాబాద్​లోని (Hyderabad) గాంధీభవన్​లో బుధవారం నిర్వహించారు. వేడుకల్లో సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth reddy) కలిసి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

Shabbir Ali | వినతులు స్వీకరించిన షబ్బీర్ అలీ

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు గాంధీభవన్​లో బుధవారం ప్రజావాణి (Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

గాంధీభవన్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరిస్తున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ