Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్​ పార్టీ ఘనతే..: షబ్బీర్ అలీ

Shabbir Ali | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్​ పార్టీ ఘనతే..: షబ్బీర్ అలీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (BC Reservation) పెంపు చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

దోమకొండ (domakonda) మండల కేంద్రంలో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో (Chamundeshwari Temple) బోనాల పండుగ (Bonalu Festival) సందర్భంగా ఆదివారం ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూతపడిన విజయ డెయిరీని తిరిగి ప్రారంభించారు.

Shabbir Ali | పదేళ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆలోచన చేయలేదు..

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కసారి కూడా రిజర్వేషన్ పెంచాలన్న ఆలోచన చేయలేదన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలోని బీసీ సంఘాలతో బీఆర్​ఎస్​ అధినాయకులు దోబూచులాడి రిజర్వేషన్​ ప్రక్రియను మూలన పడేశారని దుయ్యబట్టారు. కానీ కాంగ్రెస్​ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్​ను పక్కాగా అమలు చేస్తోందని వివరించారు.

Shabbir Ali | ఉమ్మడి రాష్ట్రంలోనూ అన్యాయమే..

ఉమ్మడి రాష్ట్రంలో 34 శాతం ఉన్న రిజర్వేషన్​ను 22 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. రిజర్వేషన్లను తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహించారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయబోతోందని స్పష్టం చేశారు. త్వరలో రిజర్వేషన్ అమలులోకి వస్తుందన్నారు.

Must Read
Related News