11
అక్షరటుడే, ఇందూరు: Skating | స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (School Games Federation) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ స్కేటింగ్ రింక్‌లో బుధవారం ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని (Hyderabad) బరంపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ రాంచందర్ పాల్గొన్నారు.