Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ముగిసిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ టోర్నీ

Nizamabad City | ముగిసిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ టోర్నీ

Nizamabad City | నిజామాబాద్​ పాత కలెక్టరేట్​ మైదానంలో ఎస్​జీఎఫ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ టోర్నీలు ముగిశాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు: Nizamabad City | జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి పోటీలు (SGF district level competitions) సోమవారం ముగిశాయి. అండర్‌–17 వాలీబాల్ (Volleyball), అండర్‌ –14 కబడ్డీ పోటీలకుగాను 16 జోన్ల బాలబాలికల జట్లు పాల్గొన్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు.

గెలిచిన జట్లకు జిల్లా యువజన క్రీడల అధికారి పవన్‌ కుమార్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీడీలు విద్యాసాగర్‌ రెడ్డి, గోపిరెడ్డి, రాజేందర్, అమరవీర్‌ రెడ్డి, కస్తూరి శ్రీనివాస్, రాజేశ్వర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad City | వాలీబాల్‌లో విజేతలు..

బాలుర విభాగంలో నందిపేట్‌ జోన్, డిచ్‌పల్లి జోన్‌ మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి.
బాలికల విభాగంలో ఆర్మూర్‌ రూరల్‌ జోన్, డిచ్‌పల్లి జోన్‌ నిలిచాయి.
కబడ్డీ అండర్‌– 14 బాలుర విభాగంలో భీమ్‌గల్‌ రూరల్, ఆర్మూర్‌ రూరల్‌ మొదటి, రెండు స్థానాల్లో నిలవగా, బాలికల విభాగంలో నిజామాబాద్‌ అర్బన్‌ మొదటి, నందిపేట్‌ జోన్‌ రెండో స్థానంలో నిలిచాయి.