అక్షరటుడే, వెబ్డెస్క్ : SFI Bandh | రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (Fee reimbursement) , స్కాలర్షిప్ (Scholarship) బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. బకాయిల విడుదలలో ప్రభుత్వ తీరుకు నిరసనగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు.
ఎస్ఎఫ్ఐ పిలుపు నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రైవేట్ కాలేజీలు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు మొంథా తుఫాన్ (Cyclone Montha) ప్రభావంతో మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరంగల్, హన్మకొండ జిల్లాలకు మరో 24 గంటలు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఆ జిల్లాల కలెక్టర్లు గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచించారు. ములుగు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడీ సెంటర్లకు కలెక్టర్ దివాకర్ సెలవు ప్రకటించారు.

