అక్షరటుడే, వెబ్‌డెస్క్: Life imprisonment : తమిళనాడు(TamilNadu)లో సంచలనం సృష్టించిన 2019లో జరిగిన పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు 2019 (Pollachi sexual harassment case)లో మహిళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని కోయబంత్తూర్‌లోని సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదును విధించింది. దీనికితోడు ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల జరిమానా విధించింది. దీనికితోడు బాధితులకు రూ.85 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మహిళల వ్యక్తిగత వీడియోలు తీసి, వారిని లైంగికంగా వేధించిన కేసులో A1 – శబరిరాజన్, A2 – తిరునావుక్కరసు, A3 – సతీశ్, A4 – వసంతకుమార్, A5 – మణివన్నన్, A6- బాబు, A7 – హరనిమాస్పాల్ , A8 – అరులానందం, A9- అరుణ్‌కుమార్ నిందితులు. ఈ తొమ్మిది మంది కూడా 2019 నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. వారిని కట్టుదిట్టమైన భద్రతతో మంగళవారం సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చారు.
వారిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు వారిపై దాడి చేస్తారని భావించిన పోలీసులు కోర్టు దగ్గర భారీగా మోహరించారు. ఈ కేసు విచారణలో న్యాయస్థానం వీరందరినీ దోషులుగా తేల్చి, వారికి జీవితఖైదు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ Tamil Nadu Chief Minister Stali స్పందించారు. నేరస్థులకు తగిన శిక్ష పడిందన్నారు.