ePaper
More
    HomeజాతీయంBihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి..! రెండేళ్లలో మూడు అబార్షన్లు

    Bihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి..! రెండేళ్లలో మూడు అబార్షన్లు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : తన సహోద్యోగి (colleague) లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. బీహార్​లో ఈ ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తూ గత రెండేళ్లుగా తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆరోపించింది. ఈ రెండు సంవత్సరాల్లో అనేక వివిధ కారణాలు చూపించి, మూడు సార్లు అబార్షన్ చేయించాడని వాపోయింది.

    Bihar : బాధితురాలి ఫిర్యాదు ప్రకారం..

    బాధిత లేడీ కానిస్టేబుల్​ బీహార్​లోని బక్సార్​ జిల్లా (Buxar district) లో పని చేస్తోంది. నిందితుడు గయా జిల్లాలో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 2023లో ఈ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అదే ఏడాది ఏప్రిల్​లో బాధితురాలు వారణాసికి (Varanasi) వెళ్లినప్పుడు, నిందితుడు ఆమెను హోటల్​కు తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.

    READ ALSO  Supreme Court | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్​.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

    Bihar : ఎవరికీ తెలియకుండా..

    ఆమె ఎదురు తిరగడంతో బ్రతిమిలాడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అదే సంవత్సరం మేలో బాధితురాలు గర్భం దాల్చడంతో.. ఝార్ఖండ్​ (Jharkhand) లోని దేవ్​గఢ్​ ఆలయంలో ఎవరికీ తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ విడివిడిగా ఉన్నారు. తెలియకుండా ఆమెకు మందులు ఇచ్చి, అబార్షన్​ అయ్యేలా చేశాడు.

    అలా రెండేళ్లలో మూడు సార్లు అబార్షన్​ చేయించాడు. కాగా, సదరు వంచక కానిస్టేబుల్​ గత మే నెలలో మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో.. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కి మ‌హ‌ర్ధ‌శ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    More like this