HomeUncategorizedMedical College | మెడికల్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. సీఎం సీరియస్​

Medical College | మెడికల్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. సీఎం సీరియస్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Medical College | మెడికల్ కాలేజీ విద్యార్థినులపై సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లోని కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాబ్ అటెండెంట్ కల్యాణ్ చక్రవర్తి, మరో ఉద్యోగి జిమ్మి రాజు తమను వేధిస్తున్నారని కాలేజీలోని 50 మంది పారా మెడికల్ విద్యార్థినులు(Paramedical Students) ఆరోపించారు. వారు తమ శరీర భాగాల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.

Medical College | విచారణకు ఆదేశం

నిందితులు నెల రోజులుగా విద్యార్థినులను వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన కాకినాడ జీజీహెచ్​లో జరిగింది. కాగా ఈ ఆస్పత్రి రంగరాయ మెడికల్ కాలేజీ(Rangaraya Medical College)తో అనుబంధంగా కొనసాగుతోంది. మెడికల్​ కాలేజీలో వేధింపులపై ప్రభుత్వం సీరియస్​ అయింది. సమగ్ర విచారణ జరపాలని కాకినాడ కలెక్టర్‌(Kakinada Collector)ను ఆదేశించింది.

Medical College | నివేదిక కోరిన సీఎం చంద్రబాబు

కాకినాడ మెడికల్‌ కాలేజీ ఘటనపై చంద్రబాబు(Chandrababu) సీరియస్‌ అయ్యారు. లైంగిక వేధింపుల ఘటనపై నివేదిక సమర్పించాలని ఆయన ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కల్యాణ్‌ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు విద్యార్థినులను వేధించారని అధికారులు సీఎంకు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు.

Medical College | ఇద్దరి అరెస్ట్​

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో నిందితుడు బయో కెమెస్ట్రీ ల్యాబ్‌ అటెండెంట్‌ కల్యాణ్‌ చక్రవర్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook