అక్షర టుడే, ఎల్లారెడ్డి: YellaReddy mandal | మండలకేంద్రంలో గ్రామ స్వరాజ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు (sewing training center inauguration). ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రకాశ్ (MPDO prakash) చేతులమీదుగా మహిళలకు 60 శాతం రాయితీతో కుట్టు మిషన్లు (sewing machines) అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ప్రారంభించామని, ఇందులో 15రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సాయిబాబా, మండల కోఆర్డినేటర్ కవిత పాల్గొన్నారు.
