Homeజిల్లాలుకామారెడ్డిPeddaKodapgal | తెగిపడిన 11కేవీ విద్యుత్ వైర్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..

PeddaKodapgal | తెగిపడిన 11కేవీ విద్యుత్ వైర్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..

విద్యుత్​ తీగలు తెగిపడి ఇళ్లపై పడ్డాయి. ఆ సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన పెద్దకొడప్​గల్​ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, పెద్దకొడప్​గల్​: PeddaKodapgal | విద్యుత్​ వైర్లు తెగిపడి ఇళ్లపై పడగా ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటన పెద్దకొడప్​గల్​ మండల కేంద్రంలో (Peddakodapgal mandal center) మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేంద్రంలోని కొత్త ప్లాట్ల ఏరియాలో మంగళవారం ఉదయం 11 కేవీ వైర్లు ఒక్కసారిగా తెగి ఇళ్లపై పడ్డాయి. అయితే ఆ సమయంలో జనాలు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

PeddaKodapgal | కాలనీవాసుల నిరసన

11కేవీ వైర్లతో ప్రమాదం పొంచి ఉందని తమ ఇళ్లపై నుంచి ఈ విద్యుత్ ​తీగలను తొలగించాలని పేర్కొంటూ కాలనీవాసులు గతంలోనూ విద్యుత్​శాఖ అధికారులకు (electricity department officials) విన్నవించారు. అయినప్పటికీ వారు పెడచెవిన పెట్టారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గాంధీ చౌక్​ వద్ద ధర్నాకు దిగారు.

విద్యుత్​ వైర్లు తెగిపడిన సమయంలో ఎవరూ లేకపోవడం మంచిదైందని.. లేకపోతే ప్రాణాలు పోయేవని వారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తీగలను ఇళ్లపై నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై అరుణ్​కుమార్​ (SI Arun Kumar) కాలనీవాసులు ధర్నా చేస్తున్న గాంధీ చౌక్​కు చేరుకున్నారు. సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ధర్నా విరమించారు.

Must Read
Related News