అక్షరటుడే, లింగంపేట: Diarrhea | తాడ్వాయిలో (Tadwai) డయేరియా కలకలం రేపింది. అతిసార కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలం దేమికలాన్లో (Demikalan) బుధవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో వారంరోజుల నుంచి వాంతులు విరేచనాలతో (Vomiting with diarrhea) బాధపడుతూ పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో ఇద్దరు బుధవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన కొనింటి భూమయ్య(70), మెట్టు స్వామి(35) డయేరియా కారణంగా మృతి చెందారు.
Diarrhea | కలుషిత నీరా.. ఆహారమా..?
గ్రామంలో డయేరియా విజృంభించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కలుషిత ఆహారం (Contaminated food), కలుషిత నీరుతో ఇలా జరిగిందా లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. వెంటనే గ్రామంలో వైద్యసిబ్బంది శిబిరాన్ని (Medical camp) ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గ్రామంలో ఏకకాలంలో ఇద్దరు మృతిచెందడంతో భయాందోళనకు గురవుతున్నారు.