అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం గాలి నాణ్యత చాలా పేలవంగా ఉందని అధికారులు తెలిపారు. AQI రీడింగ్ 355గా నమోదైంది.
ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) దాదాపు నెల రోజులుగా నిరంతర వాయు కాలుష్యంతో సతమతమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) డేటా ప్రకారం గురువారం ఢిల్లీని విషపూరిత పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత ‘చాలా పేలవమైన’ వర్గంలోనే కొనసాగుతోంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పడిపోయాయి. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు నమోదు అయింది. ఢిల్లీలో గురువారం ఆకాశం స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో పొగమంచు కప్పేసే అవకాశం ఉందన్నారు.
Delhi Pollution | ప్రజలు ఉక్కిరిబిక్కిరి
తీవ్రమైన వాయు కాలుష్యం (Delhi Air Pollution) తో ఢిల్లీవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారు గాలి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం నగరంలో 349 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index)ని నమోదు చేయగా, బుధవారం సాయంత్రం 4 గంటలకు 327గా నమోదైంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 390 గా ఉంది, వజీర్పూర్ ‘తీవ్రమైన’ కేటగిరీలో 406 అత్యల్ప AQI స్థాయిని నమోదు చేసింది, బవానా 405గా నమోదైంది. వాయు కాలుష్యం పెరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Delhi Pollution | గాలినాణ్యత ఎంత ఉండాలంటే..
CPCB ప్రకారం గాలి నాణ్యత(AQI) 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిది. 51–100 సంతృప్తికరం, 101 నుంచి 200 మోడరేట్, 201– 300 పేలవంగా పరిగణిస్తారు. 301 నుంచి 400 మధ్య గాలి నాణ్యత ఉంటే.. చాలా పేలవంగా ఉన్నట్లు, 401 నుంచి 500 మధ్య ఉంటే తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంటారు.