అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trains cancellation | రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్‌లు (Railway tracks) సైతం ధ్వంసమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
కామారెడ్డి జిల్లాలోని (Kamareddy district) భిక్కనూరు–తలమడ్ల సెక్షన్లో రైల్వే ట్రాక్‌పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అక్కన్నపేట్ – మెదక్, గజ్వేల్ – లకుడారం, బోల్సా – ఖర్ఖేలి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న సెక్షన్లు వరదలతో ప్రభావితమయ్యాయి. దీంతో అధికారులు ఈ నెల 30న పూర్ణా–అకోలా, అకోలా–పార్లి వైజ్నాథ్, అకోలా–అకోట్ మధ్య నడిచే 77608, 77609, 77610,77611, 77612, అకోలా– పూర్ణ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. 31న పార్లి వైజ్నాథ్–ఆదిలాబాద్, ఆదిలాబాద్–పూర్ణ, పూర్ణ–జల్నా, సెప్టెంబర్ 1న జల్నా–నాగర్సోల్, నాగర్సోల్–జల్నా, జల్నా–నాందేడ్ రైళ్లను రద్దు చేశారు.
వర్షాల నేపథ్యంలో ఆగస్టు 30న కాచిగూడ–నాగర్సోల్, నిజామాబాద్–కాచిగూడ, నాందేడ్–మేడ్చల్, కాచిగూడ, కరీంనగర్ (Karimnagar), కాచిగూడ–మెదక్, సికింద్రాబాద్ – సిద్దిపేట, పండరిపూర్–నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 31న నాగర్సోల్–కాచిగూడ, మెదక్–కాచిగూడ, సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను క్యాన్సిల్ చేశారు.
Trains cancellation | ప్రయాణికులు సహకరించాలి
రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల ఫోన్లకు మెసేజ్ పంపుతామన్నారు. ప్రయాణికులు అధికారులతో సహకరించాలని కోరారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.