అక్షరటుడే, వెబ్‌డెస్క్: nizamabad commissionerate | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలు బదిలీ si transfers nizamabad అయ్యారు. ప్రత్యేకించి ఆరోపణలు ఉన్న పలువురిని విధుల నుంచి తప్పించారు. జక్రాన్‌పల్లి తిరుపతిని వీఆర్‌కు అటాచ్ చేశారు. అలాగే ఆర్మూర్ పీఎస్ ఎస్సై–1 మహేశ్‌ను సైతం వీఆర్‌కు పంపించారు. మెండోరా ఎస్సై నారాయణను వీఆర్‌కు అటాచ్ చేశారు.
సీసీఎస్‌లో ఉన్న రమేశ్‌ను ఆర్మూర్ పీఎస్ ఎస్సై–1గా నియమించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా పీఎస్ ఎస్సై మాలిక్ రెహమాన్‌ను జక్రాన్‌పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. రెండో టౌన్లో ఉన్న ఎస్సై యాసిర్ అరాఫత్‌ను మెండోరా ఎస్సైగా నియమించారు. జగిత్యాల్ వీఆర్‌లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్‌ను రెండో ఎస్సై–1గా ట్రాన్స్ఫర్ చేశారు. కాగా.. సీపీ సాయి చైతన్య పలువురి పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.
1 comment
[…] SI Transfers | నిజామాబాద్ కమిషనరేట్ Nizamabad Commissionerate పరిధిలో పలువురు ఎస్సైలు స్థాన చలనం […]
Comments are closed.