అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Drunk Drive | డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన పలువురికి జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 21 మంది మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కారు.
వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 13 మందికి రూ.10వేల చొప్పున జరిమానాలు విధించింది. అలాగే మరో 8 మందికి జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ట్రాఫిక్ ఏసీపీ పేర్కొన్నారు.
Drunk Drive | మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం..
మైనర్లు వాహనాలు నడపం చట్టరీత్యా నేరమని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఆయన వివరించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బైక్లు నడపాలని సూచించారు.
