అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/ ఆర్మూర్: Drunk Driving | డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు (drunk driving checks) చేపట్టగా 12 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి 8 మందికి రూ. 59వేల జరిమానా విధించారు. మరో నలుగురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.
Drunk Driving | ఆర్మూర్లో..
ఆర్మూర్ పట్టణంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ (SHO Satyanarayana) తెలిపారు. ఈ తనిఖీల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఆర్మూర్ కోర్టులో హాజరు పరిచారు. ఈ ముగ్గురికి రూ. 10వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఎస్హెచ్వో తెలిపారు.
