అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | మద్యం సేవించి వాహనాలు నడపడవద్దని పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ వాహనదారులు నిర్లక్ష్యాన్ని వీడట్లేదు. తాగి నడుపుతూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు.
పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిన 14 మందికి గురువారం జైలుశిక్ష విధించిన కోర్టు శుక్రవారం మరొక 8 మందికి జరిమానా విధించింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో (Devunipalli police station) పరిధిలో నలుగురికి, కామారెడ్డి (Kamareddy) పరిధిలో ఇద్దరికి, సదాశివనగర్, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరి చొప్పున మొత్తం 8 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు రూ.1,000 చొప్పున జరిమానా విధించింది.
అలాగే కామారెడ్డి పోలీస్ స్టేషన్ (Kamareddy police station) పరిధిలో 13 మంది, దేవునిపల్లి పరిధిలో 15 మంది, బీబీపేట పరిధిలో ఇద్దరు, భిక్కనూరు పరిధిలో ఇద్దరు, దోమకొండ పరిధిలో ఇద్దరికి మొత్తం 34 మందికి రూ.వెయ్యి చొప్పున 34 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.