అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police Transfers | రాష్ట్రంలో ఓ సీఐ, పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. మొత్తం 8 మందికి స్థాన చలనం కలిగిస్తూ మల్టీ జోన్–2 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.సూర్యాపేట డీసీఆర్బీ (Suryapet DCRB)లో పని చేస్తున్న సీఐ వై హరిబాబు నకిరేకల్ ఠాణా ఎస్‌హెచ్‌వోగా బదిలీ అయ్యారు.
నల్గొండ సీసీఎస్‌లో పని చేస్తున్న ఎస్సై పి విష్ణు మూర్తి నార్కెట్పల్లికి, అక్కడ పని చేస్తున్న క్రాంతి కుమార్‌ను వీఆర్‌కు అటాచ్ చేశారు. చండూర్ ఎస్సై వెంకన్నను గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌కు, అక్కడ ఉన్న పి మధును వీఆర్‌కు అటాచ్ చేశారు. నల్గొండ సీసీఎస్ (Nalgonda CCS)లో పని చేస్తున్న శివకుమార్‌ను చండూర్ ఠాణాకు, వీఆర్‌లో ఉన్న సైదులును నల్గొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పంపించారు. భువనగిరి సీసీఎస్‌లో ఉన్న టి లింగారెడ్డిని అదే జిల్లాలోని రాజంపేట ఠాణా (Rajampet Police Station)కు బదిలీ చేశారు.