Homeజిల్లాలునిజామాబాద్​Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన పలువురికి జైలు

Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన పలువురికి జైలు

డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడిన పలువురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నగరంలో పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడగా వారిని న్యాయస్థానంలో హాజరుపర్చారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Drunk Drive | డ్రంకన్​ డ్రైవ్​లో (Drunk Drive) పట్టుబడిన పలువురికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టగా.. పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

వారికి కౌన్సెలింగ్​ నిర్వహించి.. సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ నుర్జహాన్​ (Magistrate Nurjahan) ఎదుట హాజరుపర్చారు. 32 మంది మద్యం తాగి వాహనాలు నడపగా.. వారికి రూ. 56,500 జరిమానా విధించారు. అందులో ఇద్దరికి రెండురోజుల జైలుశిక్ష, ఒకరికి మూడురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali) మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఇతరులకు కూడా నష్టం జరిగే అవకాశాలున్నాయని చెప్పారు.