అక్షరటుడే, వెబ్‌డెస్క్: Alluri SitaramaRaju district bus accident : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. చిత్తూరు జిల్లాకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు Travell Bus అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 15 మంది వరకు మృతి చెందగా , మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తున్న సమయంలో ఘాట్‌రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ సిటీజన్లు భద్రాచలం రాములవారిని దర్శించుకొని, అన్నవరంకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్న బస్సు (నెంబరు: AP 39 UM 6543) రాజుగారి మెట్ట మలుపు వద్ద చెరపట్టి లోయలోకి దూసుకెళ్లింది.
Alluri SitaramaRaju district bus accident : అతివేగమే కారణమంటున్న ప్రయాణికులు
ప్రమాదానికి కారణం డ్రైవర్ Driver అతివేగమనే ఆరోపణలు వస్తున్నాయి. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు పడిపోయిన వెంటనే ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ సహాయం కోసం అరిచారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అటవీ సిబ్బంది, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా కొంతమంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోయలో పడిపోయిన బస్సును వెలికి తీయడానికి అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్న కారణంగా మారేడుమిల్లి–చింతూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
మృతుల వివరాలు, పూర్తి సమాచారం కోసం అధికారులు వేచిచూస్తున్నారు.రక్షణ చర్యలు పూర్తయ్యాకే ఖచ్చితమైన మృతుల సంఖ్య మరియు ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు Chandra babu naiduతీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద జరిగిన యాత్రికుల ప్రైవేటు బస్సు ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందంటూ స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని చంద్రబాబు అన్నారు. ఈ ప్రమాదంపై అధికారులతో మాట్లాడి… బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు సేకరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకి ఆదేశాలు జార ఈచేశారు. ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కూడా ఏపీ సీఎం హామీ ఇచ్చారు.