అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Drunk Driving | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా డ్రంకన్ డ్రైవ్ lo పట్టుబడిన 16 మందికి రూ.25,500 జరిమానా విధించారు. అలాగే మరో ఇద్దరికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని ఏసీపీ తెలిపారు.
Drunk Driving | మోపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో..
మద్యంతాగి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష విధించారు. మోపాల్ ఎస్సై సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 4న మోపాల్ మండలంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన సిర్పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గంగాధర్‌ను ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నూర్జహాన్ బేగం ఎదుట హాజరుపర్చగా ఆయనకు నాలుగురోజులు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Drunk Driving | కామారెడ్డిలో ఇద్దరికి..
అక్షరటుడే, కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఇటీవల పోలీసులు చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బైద్యాపూర్‌కు చెందిన డెకరేషన్ పనులు చేసే డేకల్ మెతే, ఉత్తరప్రదేశ్ లోని డోమఖాస్‌కు చెందిన పెయింటర్ రవీంద్ర చౌహాన్ పట్టుబడ్డారు. వీరిని బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ ఇద్దరికి రెండు రోజుల జైలుశిక్షతోపాటు రూ.200 జరిమానా చొప్పున విధించినట్లు ఎస్పీ చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనం నడపవద్దని సూచించారు.