148
అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPS Promotions | రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు (IPS officers) పదోన్నతి కల్పించింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఆరుగురికి డీఐజీలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర క్యాడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఐపీఎస్ (పే) రూల్స్ 2016 పే మ్యాట్రిక్స్‌లోని సూపర్ టైమ్ స్కేల్ (i), లెవల్ 13Aలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజిపి) హోదాకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదోన్నతి పొందిన వారిలో ఐపీఎస్ అధికారులు ఎన్ శ్వేత, ఆర్ భాస్కరన్, చందనా దీప్తి, కల్మేశ్వర్ శింగేనవార్, రోహిణి ప్రియదర్శిని, విజయ్ కుమార్ ఉన్నారు.