అక్షరటుడే, కామారెడ్డి : Dog Bite | వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. రాజంపేట మండలం (Rajampet Mandal) అన్నారం తండాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తండా (Annaram Thanda)కు చెందిన మాలోత్ దీప్లా, సంగీత, వినోద్, ధర్మిలకు గాయాలు అయ్యయి.
Dog Bite | కామారెడ్డి జీజీహెచ్‌కు తరలింపు..
వెంటనే స్థానికులు గమనించి 108 అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రి (Kamareddy Area Hospital)కి తరలించారు. వీధి కుక్కలు ప్రతిరోజు ఆయా కాలనీల్లో వీరంగం సృష్టిస్తున్నాయని తండా వాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల (Street Dogs) భారీ నుంచి తమను కాపాడాలని తండావాసులు కోరుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి కుక్కలను గ్రామం నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
