అక్షరటుడే, వెబ్‌డెస్క్: IAS Promotions | రాష్ట్రంలో మరో 11 మంది ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్ లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Government Chief Secretary Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పని చేస్తున్న 2013 బ్యాచ్ ఐఏఎస్‌లకు అడిషనల్ సెక్రటరీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో శషాంక్, అద్వైత్ సింగ్, శృతి ఓజా, శ్రీజన, వినయ్,
వాసం వెంకటేశ్వర్, శివలింగయ్య, హన్మంతరావు, హైమావతి, ఎం హరిత, కె హరిత ఉన్నారు.
కాగా తెలంగాణ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు (IAS Officers) ఐఏఎస్ అపెక్స్ స్కేల్ (లెవెల్-17)కు పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. నవీన్ మిట్టల్, దాన కిషోర్ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. అలాగే 2017 బ్యాచ్‌కు చెందిన పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ (లెవెల్–12)గా ప్రమోషన్ ఇచ్చింది. రిజ్వాన్ బాషా షేక్, మను చౌదరి, ముజామిల్ ఖాన్, వెంకటేశ్ ధోత్రే, సంతోష్ బీఎం, రాజర్షీ షా, ప్రతీక్ జైన్, ఇలా త్రిపాఠి, స్నేహ శబరీష్, రాహుల్ శర్మ, దివాకర టీఎస్, కోట శ్రీవాత్సవ, కాత్యాయనీ దేవి, నర్సింహారెడ్డి ప్రమోషన్ పొందారు. అలాగే పలువురు ఐపీఎస్ అధికారులకు సైతం పదోన్నతులు కల్పించింది.