HomeతెలంగాణIAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Postings | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్ (IAS) అధికారులను పలు జిల్లాలకు సబ్​ కలెక్టర్లు (Sub Collectors)గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆరుగురు ఐఏఎస్​ అధికారులు పోస్టింగ్​ ఇచ్చారు. భైంసా సబ్ కలెక్టర్‌గా సంకేత్ కుమార్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్‌గా ఉమాహారతిని ప్రభుత్వం నియమించింది. ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా అభిజ్ఞన్ మాల్వియా, కల్లూరు సబ్ కలెక్టర్‌గా అజయ్‌ యాదవ్‌, భద్రాచలం సబ్ కలెక్టర్‌గా మృణాల్ శ్రేష్ఠ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా మనోజ్‌ నియమితులయ్యారు.

Must Read
Related News