అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పేకాడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు(Yellareddy Police) తెలిపారు. ఈ మేరకు ఆదివారం వారు వివరాలు వెల్లడించారు.
పట్టణంలోని బ్రాహ్మణపల్లి శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 12,510 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే నాలుగు మొబైళ్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అనంతరం తెలంగాణ గేమింగ్ చట్టం(Gaming law) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ జూదం ఆడటం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే పేకాడుతున్న సమాచారం ఇచ్చిన వారి వివరాలు సైతం గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
