అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన 21 మందికి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra ) తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ (Kamareddy Police Station) పరిధిలో ఆరుగురికి, దేవునిపల్లిలో ఐదుగురికి, భిక్కనూరులో ఇద్దరికి, రాజంపేటలో ఒకరికి, బీబీపేటలో ఇద్దరికి, దోమకొండలో ఇద్దరికి, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురికి జరిమానాలు విధించడం జరిగిందన్నారు.
మొత్తంగా 21 మందికి జరిమానా విధించామని స్పష్టం చేశారు. అలాగే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి రూ.వెయ్యి జరిమానాతో పాటు 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.