అక్షరటుడే, వెబ్‌డెస్క్: DSP Transfers | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పని చేస్తున్న పలువురు ఏసీపీ, డీఎస్పీలు (ACPs and DSPs) బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 10 మందికి స్థాన చలనం కలిగించారు.
హైదరాబాద్ సీసీఎస్‌లో పని చేస్తున్న ఏసీపీ ఆది నారాయణను (ACP Adi Narayana) కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ చేశారు. అక్కడ ఉన్న అబ్దుల్ రెహ్మన్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. హైదరాబాద్ సీటీసీలో పని చేస్తున్న ప్రదీప్ కుమార్ రెడ్డిని ఆదిబట్ల ఏసీపీగా, సీఐడీ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆది మూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారు. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణిని జవహర్‌నగర్‌కు బదిలీ చేశారు.
హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న బీ మోహన్ కుమార్‌ను మేడిపల్లికి, సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న రవీందర్‌ను భువనగిరి డీఎస్పీగా పంపించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో ఉన్న సీహెచ్ శ్రీధర్‌ను మహంకాళి ఏసీపీగా పంపించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న ఎస్ సారంగపాణిని ఇల్లందు డీఎస్పీగా, అక్కడ ఉన్న ఎన్ చంద్రబానును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.