అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Drunk and Drive | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. గత వారం రోజులుగా పోలీసులు నిర్వహించిన పలు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 150కి పైగా కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Drunk Drive| నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలోని ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ డివిజన్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రధాన ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 150మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రూ. 13,32,000 జరిమానాలు విధించారని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. 21 మందికి వారంరోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని సీపీ వెల్లడించారు.