Homeజిల్లాలునిజామాబాద్​Constables promotions | పలువురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

Constables promotions | పలువురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్లకు ప్రమోషన్​ లభించింది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Constables Promotions | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్లకు పోలీస్ శాఖ పదోన్నతి కల్పించింది. ఈ మేరకు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. పదిమంది కానిస్టేబుళ్లకు బాసర జోన్–2 పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా (head constables) ప్రమోషన్ కల్పించారు.

పదోన్నతిపై వీరిని జగిత్యాల జిల్లాకు పంపించారు. ప్రమోషన్​ పొందిన వారిలో కమ్మర్​పల్లి (Kammarpally) పీఎస్​ కానిస్టేబుల్​ వరప్రసాద్​, పీసీఆర్​ పీసీ సీహెచ్​.శేఖర్​, భీమ్​గల్​ పోలీస్​స్టేషన్​కానిస్టేబుల్​ జి.శ్రీనివాస్​, మాక్లూర్​ (Makloor) ఠాణాకు చెందిన కె.యాదవ్​, టూటౌన్​ కానిస్టేబుల్​ ఎండీ.ఆరీఫుద్దీన్​, కోటగిరి పీఎస్​కు చెందిన కె.చిన్నయ్య, నవీపేట ఠాణా కానిస్టేబుల్​ డి.శ్రీనివాస్​రావు, రెంజల్​ పీఎస్​కు చెందిన ఎల్​.లింబాద్రి, ఓడీ కానిస్టేబుల్​ పి.రాంచందర్​, నిజామాబాద్​ రూరల్​ పీఎస్​ కానిస్టేబుల్​ పి.గణేశ్​ ఉన్నారు. కాగా.. వీరు జగిత్యాల జిల్లాలో రిపోర్ట్​ చేయనున్నారు. అనంతరం వీరికి పోస్టింగ్​ ఇవ్వనున్నారు.

Must Read
Related News