అక్షరటుడే, వెబ్డెస్క్: India 7 All Party Delegation | సీమాంతర ఉగ్రవాదాన్ని (cross-border terrorism) ఎగదోస్తున్న పాకిస్తాన్ సిగ్గులేని వైఖరిని ప్రపంచ దేశాల ఎదుట ఎండగట్టేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందుకోసం అఖిలపక్షాలతో కూడిన ప్రత్యేక ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపిస్తోంది. ఈ మేరకు ఏడు బృందాలను నియమించిన కేంద్రం.. ఏ బృందం ఏయే దేశానికి వెళ్లనుందో తాజాగా వెల్లడించింది. మొత్తం ఏడు బృందాలు(seven teams) 32 దేశాల్లో పర్యటించనున్నాయి. ఉగ్రవాదాన్ని (terrorism) ఎగదోస్తున్న పాక్ తీరును ఎండగట్టనున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత దౌత్య యుద్ధానికి తెర తీసిన కేంద్రం.. ఈ మేరకు ఏడు అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల భారతదేశం జీరో టాలరెన్స్(zero tolerance) విధానాన్ని వివరించడానికి, జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో(jammu and kashmir, pahalgam) గత నెలలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి (terror attack) ప్రతిస్పందనగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ (operation sindoor) వివరాలను వివరించడానికి ఈ బృందాలు ఆయా దేశాల్లో పర్యటించనున్నాయి.
India All Party Delegation | 59 మంది సభ్యులు..
వివిధ పార్టీలకు చెందిన 59 మంది రాజకీయ నాయకులు (politicians), పార్లమెంటేరియన్లు, మాజీ మంత్రులు పార్టీలకు అతీతంగా భారత్ (india) తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయంతో సహా 32 దేశాలకు దౌత్యపరమైన ప్రచారం చేస్తారు. ప్రతి ప్రతినిధి బృందంలో ఏడుగురు లేదా ఎనిమిది మంది రాజకీయ నాయకులను(politicians) నియమించారు. వీరికి మాజీ దౌత్యవేత్తలు సహాయం చేయనున్నారు. ఎన్డీయే నుంచి 31 మంది, మిగతా పార్టీలకు చెందిన 20 మంది ఆయా బృందాల్లో ఉన్నారు. ఏడు ప్రతినిధుల బృందాలలో రాజకీయ నాయకులు లేదా దౌత్యవేత్తలలో కనీసం ఒక ముస్లింకు (muslim) అవకాశం కల్పించారు.
India All Party Delegation | ఏడు బృందాలు.. పర్యటించనున్న దేశాలివే..
గ్రూప్-1: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలకు ఈప్రతినిధి బృందం వెళ్లనుంది. ఈ బృందంలో బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా, నిషికాంత్ దూబే (బీజేపీ), ఫాంగ్నాన్ కొన్యాక్ (బీజేపీ), రేఖా శర్మ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), సత్నామ్ సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్, హర్ష్ ష్రింగ్లా తదితరులు ఉన్నారు.
గ్రూప్-2: యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్‌లను గ్రూప్-2 సభ్యులు సందర్శించనున్నారు. బీజేపీ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వవహించనున్న ఈ బృందంలో దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ), ప్రియాంక చతుర్వేది (శివసేన (యూబీటీ), గులాం అలీ ఖతానా, అమర్ సింగ్ (కాంగ్రెస్), సమిక్ భట్టాచార్య (బీజేపీ), ఎంజె అక్బర్, పంకజ్ సరన్ ఉన్నారు.
గ్రూప్-3: JDU ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని బృందం ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్‌లను సందర్శించనుంది. ఈ బృందంలో అపరాజిత సారంగి (బీజేపీ), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్), బ్రిజ్ లాలా (బీజేపీ), జాన్ బ్రిట్టాస్ (సీపీఎం), ప్రదాన్ బారుహ్ (బీజేపీ), హేమాంగ్ జోషి (బీజేపీ), సల్మాన్ ఖుర్షీద్, మోహన్ కుమార్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
గ్రూప్-4 : యూఏఈ, లైబీరియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్ ఈ బృందం పర్యటించనుంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో బన్సూరి స్వరాజ్ (బీజేపీ), ఇటి మహమ్మద్ బషీర్(ఐయూఎంఎల్), అతుల్ గార్గ్ (బీజేపీ), సస్మిత్ పాత్ర (బీజేడీ), మనన్ కుమార్ మిశ్రా (బీజేపీ), ఎస్ఎస్ అహ్లువాలియా, సుజన్ చినోయ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
గ్రూప్-5: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాలను సందర్శించనుంది. ఈ బృందంలో సభ్యులుగా శాంభవి (LJP (రామ్ విలాస్)), సర్ఫరాజ్ అహ్మద్ (JMM), హరీష్ బాలయోగి (TDP), శశాంక్ మణి త్రిపాఠి (బీజేపీ), భువనేశ్వర్ కలిత (బీజేపీ), మిలింద్ మురళీ దేవరా (శివసేన), తరంజిత్ సింగ్ సంధు, తేజస్వి సూర్య (బీజేపీ) తదితరులు ఉన్నారు.
గ్రూప్-6: స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలను సందర్శించడానికి ఈ బృందం వెళ్లనుంది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని ఈ బృందంలో రాజీవ్ రాయ్ (SP), మియాన్ అల్తాఫ్ అహ్మద్ (NC), బ్రిజేష్ చౌతా (బీజేపీ), ప్రేమ్ చంద్ గుప్తా (RJD), అశోక్ కుమార్ మిట్టల్ (AAP), మంజీవ్ S పూరి, జావేద్ అష్రఫ్ తదితరులు ఉన్నారు.
గ్రూప్-7: ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా సందర్శించేందుకు వెళ్లనున్న ఏడో గ్రూప్‌లో సుప్రియా సూలే, రాజీవ్ ప్రతాప్ రూడీ (బీజేపీ), విక్రమజీత్ సింగ్ సాహ్నీ (ఆప్), మనీష్ తివారీ (కాంగ్రెస్), అనురాగ్ సింగ్ ఠాకూర్ (బీజేపీ), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టీడీపీ), ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.