ePaper
More
    HomeజాతీయంPanchkula, Haryana | కారులో ఏడు డెడ్ బాడీలు.. కావాలనే డోర్లు లాక్ చేసుకుని..

    Panchkula, Haryana | కారులో ఏడు డెడ్ బాడీలు.. కావాలనే డోర్లు లాక్ చేసుకుని..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Panchkula, Haryana హరియాణాలోని పంచకులలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నిలిపి ఉంచిన కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

    పంచకుల సెక్టార్ 27లో ఉన్న ఒక ఇంటి ఎదుట ఉన్న ఈ కారు నిలిపి ఉంది. అందులో ఏడు డెడ్ బాడీలను గుర్తించారు. కాగా.. వారంతా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ కుటుంబంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. చనిపోయిన వారిని డెహ్రాడూన్​కు చెందిన ప్రవీణ్ మిటల్ (42) కుటుంబ సభ్యులుగా పోలీసులు గురించారు.

    Panchkula, Haryana | కారులో చనిపోయిన వారు వీరే..

    చనిపోయిన వారిలో ప్రవీణ్ మిట్టల్, అతని భార్య, ముగ్గురు పిల్లలు, ప్రవీణ్ తల్లిదండ్రులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు Preliminary investigation లో వెల్లడైంది. భారీగా అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. డెహ్రాడూన్ కు చెందిన ప్రవీణ్ కుటుంబంతో కలిసి పంచకులలో జరిగిన హనుమాన్ కథ కార్యక్రమాని(Hanuman Katha program)కి వచ్చారు. ఈ ఈవెంట్ అయిపోయాక.. డెహ్రాడూన్​కు వెళ్తున్న సమయంలో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారా.. లేక ముందే ప్లాన్​ ప్రకారం చేశారా అనేది సందేహంగా ఉంది.

    Panchkula, Haryana | ముందుగానే సూసైడ్ నోట్ రాసి

    కాగా, కారులో లభించిన సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా కారు డోర్లు మూసేసుకుని ఊపిరాడని స్థితిలో విషం తాగి ఈ కుటుంబం చనిపోయినట్లు తెలుస్తోంది. కారులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబాన్ని గమనించిన స్థానికులు.. డోర్లు ఓపెన్ చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ తెరుచుకోకపోవడంతో 112కు కాల్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ కు సమాచారం అందించారు. ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకునే లోపే వారందరి ప్రాణాలు పోయాయని చెబుతున్నారు.

    పంచకులలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి(private hospital) మార్చురీకి ఏడు మృతదేహాలను తరలించారు. సూసైడ్ నోట్​లో ఏముందనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇలా కారులో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్​కు గురిచేసింది. పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ టీం(forensic team) చేసిన పరిశీలనలో సామూహిక ఆత్మహత్యలుగా తేలిందని ప్రకటించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...