అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sevalal Maharaj Birth Anniversary | మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంజారా మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Sevalal Maharaj Birth Anniversary | బంజారాలతో కలిసి నృత్యం..
బంజారాలతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శి అన్నారు. ఆయన బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. బంజారాలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం బంజారాల కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు.
తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు..
తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి మౌలిక సదుపాయాల కల్పన చేసి విద్య, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బంజారాల మహోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ సహకారంతో బంజారా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం అల్ ఇండియా బంజారా సేవా సంఘం(All India Banjara Service Association) క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బంజారా సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
