Maoists
Maoists | మావోయిస్టులకు ఎదురుదెబ్బ‌.. లొంగిపోయిన కీలక నేతలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ డీజీపీ (AP DGP) హరీశ్‌కుమార్‌గుప్తా ఎదుటు పలువురు మావోయిస్టులు (Maoists) శనివారం లొంగిపోయారు. వీరిలో అగ్రనేతలు కమలేశ్​, అరుణ ఉన్నారు. కృష్ణ జిల్లాకు చెందిన వీరు మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అరుణ ప్రస్తుతం డివిజన్​ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతోంది. తాజాగా వీరు లొంగిపోయారు.

Maoists | భారీగా ఆయుధాలు స్వాధీనం

లొంగిపోయిన మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు (AOB)లోని మావోయిస్ట్​ డంప్​ను కనుగొన్నారు. ఏకే 47 సహా 15 తుపాకులు, రాకెట్​ లాంచర్లను పట్టుకున్నారు. అత్యాధునిక ఆయుధాలతో పాటు, వాకీటాకీలు, హ్యాండ్​ గ్రనేడ్లు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Maoists | ఆపరేషన్​ కగార్​తో..

ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) మావోయిస్టులు కలవరపడుతున్నారు. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) ప్రకటించారు. ఈ మేరకు వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. నిత్యం ఎన్​కౌంటర్లు చోటు చేసుకొని చాలా మంది మావోలు మృతి చెందుతున్నారు. దీంతో పలువురు మావోయిస్టులు ఉద్యమ బాట వీడుతున్నారు. దీంతో ఇటీవల లొంగుబాట్లు పెరిగాయి. రెండు రోజుల క్రితం ఛత్తీస్​గఢ్​లో 51 మంది మావోలు లొంగిపోయారు (Maoists Surrender). వరుస లొంగుబాట్లు, ఎన్​కౌంటర్లు మావోలు ఆందోళన చెందుతున్నారు.

Maoists | ఆయుధాలు వీడాలి

మావోయిస్టులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఏపీ డీజీపీ హరీశ్​కుమార్​ గుప్తా సూచించారు. రాష్ట్రానికి చెందిన 21 మంది వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. లొంగిపోకపోతే మావోల నియంత్రణకు చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.