Homeభక్తిTirumala | కనుల పండువగా శ్రీవారి గరుడ సేవ

Tirumala | కనుల పండువగా శ్రీవారి గరుడ సేవ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి గరుడ వాహన సేవ నిర్వహించారు.

స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో స్వామి వారిని తిలకించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచే భారీ ఎత్తున భక్తులు కొండపైకి వచ్చారు. దీంతో పార్కింగ్​ స్థలాలు లేక అధికారులు ప్రైవేట్ వాహనాలను అనుమతించడం నిలిపివేశారు.

Tirumala | నిండిపోయిన గ్యాలరీలు

పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తిరుమలలోని గ్యాలరీలు నిండిపోయాయి. పార్కింగ్ స్థలాలు సైతం వాహనాలతో నిండిపోవడంతో అధికారులు ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతిస్తున్నారు. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు వాహనాలు మళ్లిస్తున్నారు. తిరుమల నంబి, వసంతమండపం కూడళ్ల ఫీడర్ క్యూలైన్లు సైతం భక్తులతో నిండిపోయాయి. దీంతో మిగలిన క్యూలైన్లలోకి భక్తులను పంపిస్తున్నారు. గ్యాలరీలు నిండిపోవడంతో ఫీడర్ క్యూలైన్ల ద్వారా భక్తులకు గరుడవాహన సేవను దర్శించుకునే అవకాశం కల్పించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Must Read
Related News