భీమ్‌గల్, అక్షరటుడే: Manala Mohan Reddy | ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని రాష్ట్ర సహకార సంఘం ఛైర్మన్ మానాల మోహన్‌రెడ్డి (Manala Mohan Reddy) అన్నారు. భీమ్‌గల్ మండలంలోని (Bheemgal mandal) పిప్రి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా నూతనంగా ఎన్నికైన అరిగేల జనార్దన్, పతాని రంజిత్ (జేమ్స్) శుక్రవారం నిజామాబాద్‌లోని మానాల నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ..
ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌లను మానాల మోహన్‌రెడ్డి శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమే స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపు అని పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిప్రి గ్రామస్థులు షాన్ మల్లేష్, అరిగేల స్వామి, శ్రీనివాస్, అరిగెల దాస్, నీలం మనోహర్, కొమన్పల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.