అక్షరటుడే, భీమ్ గల్: Bheemgal | తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్–ఐకేపీ) సీఈవో దివ్య దేవరాజన్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో నిర్వహించారు. సంస్థ సిబ్బంది కలిసి పేద కుటుంబాలకు బియ్యం, పండ్లు, నిత్యావసరాలు, ఆర్థికసాయం అందజేసి పుట్టినరోజు వేడుకలను జరిపారు.
సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్, స్థానిక సిబ్బంది ఆధ్వర్యంలో ఐదుగురు నిరుపేద కుటుంబాలకు సహాయం చేశారు. ఆమె ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad district) చేసిన సేవలకు గుర్తింపుగా ఒక తండాకు ‘దివ్యగూడం’ అనే పేరు కూడా పెట్టామని పేర్కొన్నారు. ఆమె విధి నిర్వహణలో, మానవతా దృక్పథంలో ఆదర్శనీయమని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో నర్సయ్య, ఐకేపీ సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.